పలు అందాల పోటీల్లో కిరీటాలు గెల్చుకున్న హాట్ బ్యూటీ 'ఊర్వశీ రౌటేలా' ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో బిజీగా మారబోతోంది. ఇన్నాళ్లు ఐటెం గర్ల్ గా ఉన్న ఊర్వశి కి ఇప్పుడు బంపర్ అఫర్ వచ్చింది. మొదట మోడలింగ్ తో కెరియర్ మొదలు పెట్టిన ఊర్వశి, తరువాత టాలీవుడ్ లో ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ లు అందుకుంటోంది. ఇప్పటికే ఊర్వశి వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద, బ్రో సినిమాల్లో కొన్ని పాటలు చేసింది. డాకుమహారాజ్ లో పోలీసు ఆఫీసర్ గా నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ లో కూడా ఊర్వశి పేరు వినిపిస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఊర్వశి డ్రాగన్ లో ఎన్టీఆర్ తో కలిసి ఐటెం సాంగ్ చేస్తోంది అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డ్రాగన్ లో ఊర్వశి ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది అని సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి పాత్రకి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డ్రాగన్ లో ఊర్వశి చేసే పాత్ర కూడా అలాంటిదే అని సమాచారం. సో ఇక నుంచి ఊర్వశి కేవలం ఐటెం గర్ల్ గానే కాకుండా నటనకి ఆస్కారమున్న పాత్రల్లో కూడా నటిస్తుంది.
టాలీవుడ్ లో ఊర్వశి కి ఉన్న క్రేజ్ ప్రకారం హీరోయిన్ గా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. మంచి హైటూ, పర్సనాలిటీ, గ్లామర్ షో అన్నీ ఉన్నా హీరోయిన్ గా ఆఫర్స్ దక్కించుకోలేక పోతోంది. మొన్న బాలయ్య తో డాకు మహారాజ్ లో కొని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చేసింది. ఇపుడు డ్రాగన్ తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుండగా, త్వరలోనే ఊర్వశి షూటింగ్ లో జాయిన్ కానుంది అని టాక్. మొత్తానికి డ్రాగన్ కి ఊర్వశి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. పైగా ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ కావటం అదీ పాన్ ఇండియా మూవీ కావటంతో ఇక తన కెరియర్ కి తిరుగులేదని ఆశతో ఉంది ఊర్వశి.
ALSO READ: జపాన్ లో ఎన్టీఆర్ ప్రమోషన్స్