ENGLISH

Urvashivo Rakshasivo: ఊర్వ‌శివో.. రాక్ష‌సివో ట్రైల‌ర్ రివ్యూ: కొరియ‌న్ వెబ్ సిరీస్ Vs కార్తీక దీపం

31 October 2022-16:02 PM

హిట్టు కోసం బాక్సాఫీసు ద‌గ్గ‌ర దండ‌యాత్ర చేస్తూనే ఉన్నాడు అల్లు శిరీష్‌. అయినా స‌రైన స‌క్సెస్ రావ‌డం లేదు. అందుకే కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు `ఊర్వశివో.. రాక్ష‌సివో` అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాపై శిరీష్ చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. అనూ ఇమ్మానియేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా న‌వంబ‌రు 4న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది

 

``త‌నేమో కొరియ‌న్ వెబ్ సిరీస్‌లా ట్రెండీగా ఉంటే.. నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్ట‌ర్ బాబులా పేజీలు పేజీలు డైలాగులు చెబుతున్నావ్‌`` అనే ఫ‌న్నీ డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే హీరో, హీరోయిన్ ఇద్ద‌రి క్యారెక్ట‌ర్ల‌నీ చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. ఇదో ఫ‌న్ రొమాంటిక్ డ్రామాలా అనిపిస్తోంది. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంద‌న్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశార‌నిపిస్తోంది. శిరీష్ లుక్ బాగుంది. అను ఇమ్మానియేల్ తో రొమాంటిక్ సీన్లు కూడా ప‌డ్డాయి. అయితే ట్రైల‌ర్ మొత్తంలో వెన్నెల కిషోర్ దే హ‌వా. త‌న కామెడీ టైమింగ్ బాగా ప్ల‌స‌య్యింది. ఈ సినిమాని వెన్నెల కిషోర్ త‌న భుజ స్కంధాల‌పై వేసుకొని న‌డిపించిన‌ట్టు అనిపిస్తోంది. ట్రైల‌ర్ ప్రామిసింగ్ గానే ఉంది. ఫ‌న్‌, ల‌వ్ ట్రాక్ క్లిక్క‌యితే... శిరీష్ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న హిట్టు అందుకొనే ఛాన్సుంది.

ALSO READ: చిరు, బాల‌య్య‌కు దారిచ్చిన ప్ర‌భాస్‌