ENGLISH

‘వకీల్‌సాబ్‌’ దివాళీ స్పెషల్‌ వుందా.? లేదా.?

12 November 2020-17:05 PM

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న ‘వకీల్‌ సాబ్‌’ సినిమా చాలా ఇబ్బందుల్నే ఎదుర్కొంటోంది కరోనా వైరస్‌ కారణంగా. ఈ ఏడాది సమ్మర్‌లోనే విడుదల కావాల్సిన ‘వకీల్‌ సాబ్‌’ కరోనా దెబ్బకి పోస్ట్‌ పోన్‌ అయిన విషయం విదితమే. ఓ దశలో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారన్న ప్రచారం జరిగిందిగానీ, సినిమా షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో ఆ ప్రయత్నాలు కూడా వర్కవుట్‌ కాలేదు.

 

ఇదిలా వుంటే, పవన్‌ ఇటీవలే ‘వకీల్‌ సాబ్‌’ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా సినిమా షూట్‌ని పూర్తి చేసెయ్యాలన్న కసితో వున్నారు దర్శక నిర్మాతలు. అందుకు తగ్గట్టే ఎక్కడా రాజీ పడకుండా చిత్ర యూనిట్‌ అత్యంత వేగంగా, అత్యంత సమర్థవంతంగా సినిమాని పూర్తి చేసే పనిలో వుంది. మరోపక్క, ఈ సినిమా నుంచి దీపావళికి ఓ మంచి అప్‌డేట్‌ రాబోతోందన్న ప్రచారం జరిగింది.

 

అది ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ కావొచ్చు.. లేదా ట్రైలర్‌ కూడా కావొచ్చని అంటున్నారు. అయితే, మేకర్స్‌ నుంచి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఇదిలా వుంటే, ‘వకీల్‌ సాబ్‌’ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలా.? ఇంకాస్త ఆలస్యం చేయాల్సి వస్తుందా.? అన్నదానిపై గందరగోళం కొనసాగుతుంది. దిల్‌ రాజు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం విదితమే. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ నటించిన ‘పింక్‌’ సినిమాకి ఇది తెలుగు రీమేక్‌.

ALSO READ: అందుకే కీర్తీని ఎవ‌రూ వ‌ద‌ల‌డం లేదు