ENGLISH

వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమాకి రంగం సిద్ధం

19 April 2018-18:27 PM

మెగా రాకుమారుడు వరుణ్‌ తేజ్‌ 'తొలిప్రేమ' విజయం తర్వాత జోరు బాగా పెంచేశాడు. వరుసపెట్టి సినిమాలు లైన్‌లో పెట్టేశాడు. అందులో మొదటిది 'ఘాజీ' డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డితో వరుణ్‌ తేజ్‌ ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు. ఆ సినిమాకి సర్వం సిద్ధమైంది. 

తాజాగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ఇంతవరకూ తెలుగు సిల్వర్‌ స్క్రీన్‌పై ఎవ్వరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌తో వచ్చేస్తున్నాడు వరుణ్‌. స్పేస్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఏస్ట్రోనాట్‌గా వరుణ్‌ కనిపించనున్నాడు ఈ సినిమాలో. హాలీవుడ్‌ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్స్‌ జరుగుతున్నాయి. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. 

'ఘాజీ' సినిమాతో సబ్‌మెరీన్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కించి అంతవరకూ ఎవరికీ తెలియని, ఎవరూ ఊహించని కాన్సెప్ట్‌ని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి. ఇప్పుడు మరో కొత్త సబ్జెక్ట్‌ని పరిచయం చేసి, ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన అదితీరావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో పక్క వరుణ్‌, వెంకీ కాంబినేషన్‌లో 'ఎఫ్‌ 2' అనే బిగ్‌ మల్టీ స్టారర్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జూలైలో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీ రెడ్డి?!