ENGLISH

బాబాయ్ టైటిల్ లేపేసిన అబ్బాయి

23 September 2017-14:50 PM

ఫిదా చిత్ర విజయంతో మంచి ఊపుమీదున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరొక లవ్ స్టొరీ చేయడానికి సిద్ధం అయ్యాడు.

దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ తేజ్ పక్కన రాశీ ఖన్నా నటిస్తున్నది. అయితే ఈ సినిమా టైటిల్ కోసం పవన్ కళ్యాణ్ హిట్ చిత్రం టైటిల్ అయిన ‘తొలిప్రేమ’ని పరిశీలిస్తునట్టుగా సమాచారం.

ఈ చిత్ర కథ కూడా ఒక చక్కటి ప్రేమకథ అవ్వడం అలాగే ఈ టైటిల్ కి కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ టైటిల్ పెట్టె యోచనలో వున్నట్టు తెలుస్తున్నది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం యూనిట్ మొత్తం ఫారన్ వెళ్ళగా ఈ చిత్రంలో వరుణ్ కొత్త లుక్ లో కనపడనున్నాడట.

 

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్