ENGLISH

దిల్ రాజు సినిమా యూట్యూబ్ లో పెట్టేశారు

17 September 2017-12:27 PM

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేపేరు దిల్ రాజు. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ అని ప్రేక్షకుల నమ్మకం. అలాంటి దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమా ఒకటి.. యూట్యూబ్ లో దర్శనమివ్వటం, పేక్షకులకి షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే, రీసెంట్ గా వచ్చిన 'వెళ్ళిపోమాకే' మూవీ.

తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దిల్ రాజు కి బాగా నచ్చేసింది. అంతే తన బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు, ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించాడు. కానీ అనుకోకుండా తన భార్య అకాల మరణంతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. తర్వాత తన కొత్త సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది.

ఎట్టకేలకు ఈ నెలా 2 వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేసారు. విడుదలకు ముందే ప్రివ్యూ లు వేసినా, చిన్న సినిమాలని ఆదరించండి అని దిల్ రాజు పబ్లిసిటీ చేసినా ఈ సినిమాకి ఫలితం లేకపోయింది. థియేటర్లలో ఈ సినిమా రిలీజైన సంగతే చాలా మందికి తెలియదు. దాంతో సినిమా చూసేందుకు ఎవరూ రాలేదు.

దాంతో థియేటర్లకు రాకపోతే రాకపోయారు, కనీసం ఈ సినిమాను ఉచితంగా నెట్ లో చూడండంటూ యూట్యూబ్ లో పెట్టేసారు. మరి ఫ్రీ గా అయినా ఈ సినిమా చూస్తారో లేదో వేచి చూడాలి. 

ALSO READ: 'జై లవ కుశ' ప్రీ రిలీజ్‌ టాక్‌ కెవ్వు కేక