ENGLISH

వెంకీ పంతం.. నెర‌వేరుతుందా?

10 July 2021-12:46 PM

వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `నారప్ప‌`. ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ధారి. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన అసుర‌న్ చిత్రానికి ఇది రీమేక్‌. శ్రీ‌కాండ్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల్ని భారీ ధ‌ర‌కుకొనుగోలు చేసింది. ఈ నెలాఖ‌రునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తారు.

 

అయితే.. ఈ సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తే ఇంకా మంచి ఫ‌లితాలు వ‌స్తాయని ఇప్పుడు చిత్ర‌బృందం న‌మ్ముతోంది. వెంకీ అయితే.. ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి స‌సేమీరా అంటున్నాడ‌ట‌. ఎట్టిప‌రిస్థితుల్లోనూ థియేట‌ర్లోనే విడుద‌ల చేయాల‌ని ప‌ట్టుప‌డుతున్నాడ‌ట‌. దాంతో. చిత్ర‌బృందం ఓటీటీ విడుద‌ల విష‌యంలో వెన‌క‌డుగు వేయాల‌ని నిర్ణ‌యం తీసుకొంది. అయితే.. అది అంత ఈజీ కాదు. హాట్ స్టార్ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రంగా ఉంటాయి. ఒక్క‌సారి డీల్ కుదిరితే.. వెన‌క్కి తీసుకునే ప్ర‌శ్నే ఉండ‌దు. అయితే.. సురేష్ బాబు హాట్ స్టార్ తో సంప్ర‌దింపులు మొద‌లెట్టార‌ని, రెండు మూడు రోజుల్లో ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ హాట్ స్టార్ `నో` అంటే మాత్రం.. నార‌ప్ప ఓటీటీకే ప‌రిమితం అయిపోతుంది.

ALSO READ: మ‌హేష్‌కి ఢీ కొట్టేది అత‌నే!