ENGLISH

వెన్నెల కిషోర్‌.. మ‌రోసారి!

19 July 2021-10:38 AM

హాస్య‌న‌టుల్లో చాలామంది ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులేశారు. కానీ హిట్టు కొట్టిన వాళ్లు లేరు. వెన్నెల కిషోర్ కూడా.. `వెన్నెల వ‌న్ అండ్ ఆఫ్‌` సినిమాకి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో మ‌రోసారి డైర‌క్ష‌న్ జోలికి వెళ్ల‌లేదు. దానికి తోడు హాస్య న‌టుడిగా ఫుల్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల - మెగా ఫోన్ ప‌ట్టుకునే టైమ్ దొర‌క‌లేదు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ.. వెన్నెల కిషోర్ కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్న‌ట్టు టాక్. అయితే ఈసారి వెబ్ సిరీస్ కోసం.

 

ఆహా కోసం వెన్నెల కిషోర్ ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఇందులో త‌నే ప్ర‌ధాన పాత్ర కూడా పోషించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే స్క్రిప్టు సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. ఇదో వెరైటీ స‌బ్జెక్ట్ అనీ, హార‌ర్ - కామెడీ - ఫాంట‌సీ జోన‌ర్‌లో సాగ‌బోతోంద‌ని టాక్‌. రెండు నెల‌ల్లో షూటింగ్ పూర్తి చేయాల‌ని ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ రెండు నెలల్లో వెన్నెల కిషోర్ న‌ట‌న‌కు దూరం కాబోతున్నాడ‌ని, ఈ షూటింగ్ పూర్త‌య్యాక మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటాడ‌ని తెలుస్తోంది. మ‌రి... తొలి ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మైన కిషోర్‌.. ఈసారైనా హిట్టు కొడ‌తాడో లేదో చూడాలి.

ALSO READ: త‌రుణ్ భాస్క‌ర్ తో సినిమా ఉందా, లేదా?