ENGLISH

త‌స్మాత్ జాగ్ర‌త్త అంటున్న రౌడీ!

13 September 2020-12:19 PM

`సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తాం` అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, త‌ద్వారా... అమాయ‌కుల్ని మోసం చేయ‌డం చూస్తూనే ఉన్నాం. అలాంటి బ్యాచ్ ఫిల్మ్‌న‌గ‌ర్ లో మ‌రోటి బ‌య‌లుదేరింది. విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమాలో అవ‌కాశాలు ఇస్తామంటూ ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఈ విష‌యం విజ‌య్‌దేవ‌ర‌కొండ టీమ్ గ్ర‌హించింది. అలాంటి వారిప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ... విజ‌య్ దేవ‌ర‌కొండ హెచ్చ‌రిస్తున్నాడు.

 

తాము ఎలాంటి ఆడిష‌న్స్ నిర్వ‌హించ‌డం లేద‌ని, త‌మ పేరు చెప్పి కొంద‌రు మోసం చేస్తున్నార‌ని, అలాంటి వాళ్ల మాయ మాట‌లు న‌మ్మొద్ద‌ని హెచ్చిరిస్తోంది విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్‌. తాము నిజంగా ఆడిష‌న్స్ చేస్తే, అధికారిక ప్ర‌క‌ట‌న ఇస్తామ‌ని, త‌మ పేరు చెప్పి మోసం చేస్తున్న‌వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసి, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియజేసింది. సో... విజ‌య్ పేరు చెప్పి మోసం చేస్తున్న ముఠా మాయ మాట‌లు న‌మ్మొద్దు. వారి వ‌ల‌లో ప‌డొద్దు.

ALSO READ: సీత కోసం పోటీ: అనుష్క Vs అనుష్క‌.