ENGLISH

రౌడీ మాటిచ్చేశాడు.. సినిమా ప‌క్కా!

17 November 2020-12:10 PM

ఓటీటీలోనూ సూప‌ర్ హిట్లు చూడ‌గ‌లం అని నిరూపించిన సినిమా `ఆకాశం నీ హ‌ద్దురా`. సినీ అభిమానుల్ని ఈ చిత్రం విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. స్టార్లు సైతం ఈ సినిమా చూసి `సాహో` అంటున్నారు. తాజాగా... విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా చూశాడు. త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ఖాతాలో పంచుకున్నాడు. సూర్య న‌ట‌న‌, జీవీ ప్ర‌కాష్ సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ అద్భుతం అంటూ కొనియాడాడు. అంతే కాదు.. `మ‌నం త్వ‌ర‌లో క‌లిసి ప‌నిచేద్దాం` అంటూ ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర‌కు మాటిచ్చేశాడు.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు పెద్ద స్టార్‌. త‌న‌కి తాను `మ‌నం సినిమా చేద్దాం..` అని చెప్పేశాడంటే.. ఈ కాంబోకి ఇక తిరుగులేద‌న్న‌మాట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత‌... శివ నిర్వాణ‌, సుకుమార్ సినిమాలున్నాయి. అంటే.. సుధా కొంగ‌ర సినిమా ప‌ట్టాలెక్క‌డానికి మ‌రో రెండేళ్ల‌యినా ప‌డుతుంది. ఈ లోగా ఏ మాత్రం గ్యాప్ వ‌చ్చినా... సుధా కొంగ‌ర స్క్రిప్టుతో రెడీ అయిపోవొచ్చు. చూద్దాం... సుధాకి ఇంకెంత‌మంది హీరోలు ఛాన్సులు ఇస్తారో?!

ALSO READ: చిరు సినిమా నుంచి వినాయ‌క్ ఎందుకు త‌ప్పుకున్నాడు?