ENGLISH

జెర్సీ ద‌ర్శ‌కుడితో రౌడీ

20 October 2022-10:00 AM

లైగ‌ర్ తో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బాగా దెబ్బ‌డిపోయింది. ఇప్పుడు గ‌ట్టిగా క‌మ్ బ్యాక్ ఇవ్వాల్సిందే. లేదంటే.. అర్జున్ రెడ్డితో వ‌చ్చిన ఇమేజ్ ... చేజారిపోయే ప్ర‌మాదం ఉంది. ప్రస్తుతం `ఖుషి` సినిమాతో బిజీగా ఉన్నాడు విజ‌య్‌. ఆ త‌ర‌వాత సినిమాలేవీ ఒప్పుకోలేదు. కొన్ని క‌థ‌లు విన్నా, ఏదీ కిక్ ఇవ్వ‌లేదు. అందుకే నెక్ట్స్ సినిమా విష‌యంలో కాస్త సందిగ్థ‌త నెల‌కొంది. ఇప్పుడు దానికి తెర ప‌డింది. ఖుషి త‌ర‌వాత‌... రౌడీ చేయ‌బోయే సినిమా విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది.

 

గౌత‌మ్ తిన్న‌నూరితో విజ‌య్ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. జెర్సీతో తిరుగులేని విజ‌యాన్ని అందుకొన్నాడు గౌత‌మ్‌. అయితే ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే ఫ్లాప్ అయ్యింది. జెర్సీ త‌ర‌వాత‌.. చ‌ర‌ణ్ తో ఓసినిమా చేద్దామ‌నుకొన్నాడు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు అదే క‌థ‌తో... విజ‌య్ ని ఒప్పించాడు. ఇదో యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ అని, ఫీల్ గుడ్ సినిమాగా సాగ‌బోతోంద‌ని టాక్‌. ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

ALSO READ: నేను రైలు.. విజయ్ రాకెట్ : శివకార్తికేయన