ENGLISH

Varasudu: విజయ్ టైటిల్.... వారసుడు

22 June 2022-09:48 AM

విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది . ఈ చిత్రానికి 'వారసుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న చిత్రం కావడంతో 'వారసుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళ్ వెర్షన్ ని కూడా ఇదే టైటిల్ పెట్టారు.

 

ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్.

ALSO READ: ప‌వ‌న్ తో విసిగిపోయిన హ‌రీష్ శంకర్‌