ENGLISH

చిరుతో.. విజ‌య‌శాంతి?

06 June 2017-12:39 PM

చిరంజీవి - విజ‌య‌శాంతి.. ఒక‌ప్ప‌టి సూప‌ర్ డూప‌ర్ హిట్ పెయిర్‌. వీరిద్ద‌రి కాంబో అంటే.. అప్ప‌ట్లో  సూప‌ర్ హిట్ సినిమా గ్యారెంటీ !  గ్యాంగ్ లీడ‌ర్ త‌ర‌వాత‌.. చిరు, విజ‌య‌శాంతిల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయని, అవి చిరు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేంత వ‌ర‌కూ కొన‌సాగాయ‌ని ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. అయితే.. వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌సి న‌టించేందుకు రంగం సిద్ధమ‌య్యింద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. అవును.. చిరు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈసినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌కు విజ‌య శాంతి పేరు ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల చిత్ర‌బృందం విజ‌య‌శాంతితో సంప్ర‌దింపులు జ‌రిపింద‌ట‌. ఈ చిత్రంలో విజ‌య‌శాంతి ఓ విప్ల‌వ నారి పాత్రలో క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఒసేయ్ రాముల‌మ్మ చూశాక‌... ఆ త‌ర‌హా ఫైర్ బ్రాండ్ పాత్ర‌ల‌కు విజ‌యశాంతి త‌ప్ప ఇంకెవ్వ‌రూ న్యాయం చేయ‌లేర‌ని అనిపించ‌డం స‌హ‌జం. ఆ త‌ర‌హా పాత్ర ఉయ్యాల‌వాడ‌లోనూ ఉంద‌ని అందుకే.. విజ‌య‌శాంతి ని తీసుకోవాల‌ని చిత్ర‌బృందం ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. అయితే రాజ‌కీయాల్లో బిజీ అయ్యాక సినిమాల‌వైపు దృష్టి పెట్ట‌ని విజ‌య‌శాంతి ఈ పాత్ర‌కు ఓకే చెబుతుందా??  లేదా?? అనేది చూడాలి.

ALSO READ: ప్రముఖ బ్రాండ్ కి అంబాసిడర్ గా ప్రభాస్!