ENGLISH

మ‌హేష్ కోసం విక్ర‌మ్‌ని దింపుతున్నాడా?

24 February 2022-13:10 PM

మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. `స‌ర్కారు వారి పాట‌` త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా ఎవ‌రు క‌నిపిస్తార‌న్న ఆస‌క్తి అంత‌టా నెల‌కొంది. మోహ‌న్ బాబుని ఈ పాత్ర కోసం సంప్ర‌దించార‌న్న ఊహాగానాలు వ్య‌క్తం అయ్యాయి. వీటిపై మోహ‌న్ బాబు క్లారిటీ ఇచ్చారు. ``నేను ఏ సినిమాలోనూ విల‌న్ గా చేయ‌డం లేదు`` అని తేల్చి చెప్పేశారు.

 

మ‌రి విల‌న్ ఎవ‌రు? అనే ప్ర‌శ్న మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇప్పుడు ఈ రేసులో మ‌రో పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌నే.. విక్ర‌మ్. చియాన్ విక్ర‌మ్ ని ఈసినిమాలో విల‌న్ పాత్ర కోసం ప‌రిశీలిస్తున్నార‌ని టాక్. త‌మిళంలో విక్ర‌మ్ పెద్ద హీరో. కానీ ఈమ‌ధ్య త‌గిన సినిమాలు రావ‌డం లేదు. పైగా.. విక్ర‌మ్ కి పాత్ర న‌చ్చితే చాలు. చేసేస్తాడు. త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబో అంటే త‌ప్ప‌కుండా ఎట్రాక్ట్ చేసేదే. కాబ‌ట్టి... విక్ర‌మ్ నో చెప్పే ఛాన్సే లేదు. ఈ కాంబో కుదిరితే.. ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం.

ALSO READ: పవన్ కళ్యాణ్ వేరే లెవల్ : రానా