ENGLISH

ట్రైలర్: విక్రమ్ 'మహాన్'

03 February 2022-17:04 PM

విక్రమ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమైయింది. కరోనా కారణంగా విక్రమ్ సినిమాల షూటింగ్ వాయిదా పడ్డాయి. గౌతమ్ మీనన్ తో చేస్తున్న స్పై థ్రిల్లర్ చివరి దశలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు నేరుగా ఓటీటీకి ఓ సినిమా చేశారు విక్రమ్. విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ కలిసి నటించిన చిత్రం ‘మహాన్‌’. సిమ్రన్‌, సింహా కీలక పాత్రలు పోషించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు.

 

ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. మద్యనిషేధ ఉద్యమ నాయకుడి తనయుడైన విక్రమ్.. అదే మద్యం దందాని చేస్తాడు . వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన విక్రమ్‌ అలా ఎందుకు చేశాడు? అనేది సినిమాలో చూడాలి. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా వుంది. విక్రమ్ అంటేనే గెటప్స్. మహాన్ లో కూడా విక్రమ్ మూడు షేడ్స్ లో కనిపించాడు.ఇక తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం కూడా ఆసక్తిని పెంచింది. సంతోష్‌ నారాయణ్‌ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న నేరుగా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలౌతుంది.

ALSO READ: 'భీమ్లా నాయ‌క్' ట్రైల‌ర్ రెడీ