ENGLISH

చంద‌మామ ఆగ‌మ‌నం ఎప్పుడు?

19 November 2020-09:30 AM

ఇటీవ‌లే కాజ‌ల్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హ‌నీమూన్ మూడ్ లో ఉంది. కాజ‌ల్ హ‌నీమూన్ ట్రిప్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలూ... తెగ వైర‌ల్ అవుతున్నాయి. వాటిని అభిమానులు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దాంతో కావ‌ల్సినంత ఫ‌న్ వ‌స్తోంది కూడా. అయితే.. త్వ‌ర‌లోనే కాజ‌ల్ హ‌నీమూన్ ట్రిప్ ముగియ‌బోతోంది. ఇప్పుడు సినిమాల‌పై దృష్టి పెట్ట‌బోతోంది.

 

చిరంజీవి `ఆచార్య‌`లో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య షూటింగ్ ఇప్పుడు హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈనెల 20 నుంచి.. చిరంజీవి సెట్స్‌లోకి రానున్నారు. మ‌రి కాజ‌ల్ ఎంట్రీ ఎప్పుడు? అన్న‌దే ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌. హ‌నీమూన్ ముగించుకుని నేరుగా డిసెంబ‌రు 5న `ఆచార్య‌` సెట్లో కాజ‌ల్ అడుగుపెట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది. డిసెంబ‌ర్ మొత్తం... `ఆచార్య‌`టీమ్ తోనే కాజ‌ల్ గ‌డ‌ప‌బోతోంది. జ‌న‌వ‌రి లో `ఇండియ‌న్ 2` కి కాజ‌ల్ కాల్షీట్లు ఇవ్వ‌బోతోంద‌ట‌. అంటే... డిసెంబ‌రు, జ‌న‌వ‌రి ఈ రెండు నెల‌లూ కాజ‌ల్ బిజీ బిజీగా గ‌డ‌ప‌బోతోంద‌న్న‌మాట‌.

ALSO READ: Kajal Agarwal Latest Photoshoot