ENGLISH

అనుష్క 'నిశ్శబ్ధం'గా ఉండిపోయిందే!

29 January 2020-08:00 AM

స్వీటీ అనుష్క దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత నటిస్తున్న చిత్రం 'సైలెన్స్‌'. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో 'నిశ్శబ్ధం' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 31న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని చిత్రయూనిట్‌ అనౌన్స్‌ చేసింది. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ అయ్యింది కానీ, ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే, మరో మూడు రోజులు మాత్రమే రిలీజ్‌కి టైముంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ హోరెత్తిపోవాలి. అలాంటిది అంతటా సైలెంట్‌గా ఉంది. ఎక్కడా 'సైలెన్స్‌' మాట వినబడడం లేదు.

 

అప్పుడెప్పుడో టీజర్‌తో సహా కొన్ని ప్రచార చిత్రాలు వదిలారు. కానీ, విడుదల దగ్గరయ్యాకా చేసిన హడావిడినే కదా ఆడియన్స్‌ గుర్తుంచుకుంటారు. అందులోనూ స్వీటీని లైవ్‌లో చూసేందుకు తెగ తహతహలాడుతున్నారు అభిమానులు. కానీ, స్వీటీ దర్శనం జరగడం లేదు. ఒకవేళ 'నిశ్శబ్ధం' టీమ్‌ మనసు మార్చుకుందా.? రిలీజ్‌ని పోస్ట్‌ పోన్‌ చేసిందా.? అనే విషయాలు తెలియాల్సి ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఎక్కువగా అమెరికాలోనే చిత్రీకరించారు. మాధవన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ALSO READ: Anushka Latest Photoshoot