ENGLISH

Mokshagna: మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఆల‌స్యానికి కార‌ణం అదేనా?

21 September 2022-15:24 PM

నందమూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ వెండి తెర అరంగేట్రం గురించి అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌తీసారీ.. `ఈయేడాది మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయం` అంటూనే ఉన్నారు. ద‌ర్శ‌కులుగా ఎవ‌రెవ‌రి పేర్లో వినిపిస్తూ ఉండేవి. అది కాస్త వెన‌క్కి వెళ్తూనే ఉంది. 2022లోనూ ఇదే జ‌రిగింది. ఈ యేడాది మోక్ష‌జ్ఞ వ‌చ్చేస్తాడ‌ని చెప్పుకొన్నారంతా. అయితే ఆ దాఖ‌లాలు ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌లేదు.

 

అయితే.. ఈ ఆల‌స్యానికి కార‌ణం బాల‌య్యే అని తెలుస్తోంది. బాల‌య్య‌కు జాత‌కాలంటే పిచ్చి. ముహూర్తాల‌పై బాగా గురి ఎక్కువ‌. మోక్ష‌జ్ఞ ని 2023లో అరంగేట్రం చేయిస్తే జాతక రీత్యా చాలా మంచిద‌ని జ్యోతిష్యులు చెప్పార‌ట‌. అందుకే 2023 వ‌ర‌కూ మోక్ష‌జ్ఞ‌ని కెమెరా ముందుకు తీసుకురాకూడ‌ద‌ని బాల‌య్య గ‌ట్టిగా నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఈ యేడాది మోక్ష‌జ్ఞ సినిమా మొద‌ల‌వ్వ‌ద‌న్న‌మాట‌. 2023 ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తాలు బాగున్నాయ‌ని, ఆ నెల‌లోనే మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని టాక్‌. ఈలోగా.. మోక్ష‌జ్ఞ‌కు ఇంకాస్త ఫిట్ అయ్యేందుకు స‌మ‌యం చిక్కుతుంది. కొత్త క‌థ‌లూ వినొచ్చు. సో.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎవ‌రితోనో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగ‌క త‌ప్ప‌దు.

ALSO READ: 41 రోజులు మృత్యువుతో పోరాడుతూ...