Badri Re release on feb 4th

January 24, 2023 - 12:33 PM IST

హిట్ సినిమాలని మళ్ళీ విడుదల చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సినిమాలు ముందు వరుసలో వున్నాయి. జల్సా, ఖుషి సినిమా రీరిలీజ్ కి చాలా మంచి స్పందన వచ్చింది. థియేటర్స్ అభిమానులతో నిండిపోయాయి. ఇప్పుడు ‘బద్రి’ సినిమా వంతు వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ మూవీకి పవన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలోని పవన్ మేనరిజం, యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ ని యూత్ కి మరింత దగ్గరయ్యేలా చేశాయి.

 

ఈ సినిమాలో పవన్ కి కోపం వచ్చినపుడు మెడపై చేయ్యిపెట్టే మేనరిజం అయితే పవన్ కళ్యాణ్ కి సిగ్నేచర్ లా మారిపోయింది. పూరి రాసిన ‘నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రి బద్రీనాథ్’ అనే డైలాగ్ యూత్ కి తెగ నచ్చింది. ‘బంగాళాఖాతంలో’, ‘ఏ చికిత్త’ అంటూ రమణ గోగుల ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. కాగా ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఫిబ్రవరి 4న మళ్ళీ బద్రి సందడి చేయబోతుంది.