ENGLISH

ఆదివారం అద‌ర‌గొట్టిన '2.O'

03 December 2018-13:41 PM

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన 2.ఓ మంచి రివ్యూలు అందుకున్నప్ప‌టికీ ప్రారంభ వ‌సూళ్లు అల‌జ‌డి రేపాయి. బాహుబ‌లి వ‌సూళ్ల‌ని మించిపోతుంద‌ని ఆశించిన వాళ్లు... 2.ఓ మ్యాజిక్ ఫిగ‌ర్‌ని చేరుకోక‌పోవ‌డంతో నిరాశ ప‌డ్డారు. తొలి రోజు దేశ వ్యాప్తంగా రూ.110 కోట్ల గ్రాస్ సాధించింది 2.ఓ. ఓ విధంగా ఇది మంచి ఫిగ‌రే. కాక‌పోతే... ఆశించింది అంత‌కు మించి ఉండ‌డంతో వీకెండ్‌లో 2.ఓ నిల‌బ‌డ‌గ‌లుగుతుందా? అనే అనుమానాలు రేకెత్తాయి. శ‌నివారం వ‌సూళ్లు డ‌ల్ అవ్వ‌డంతో... బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్పవేమో అని లెక్క‌లేశారు.

కానీ ఆదివారం వ‌సూళ్లు... అదిరిపోయాయి. పిల్ల‌లు 2.ఓ చూడ్డానికి ఉత్సాహం చూపించ‌డంతో వాళ్ల‌ని థియేట‌ర్ల‌కు తీసుకురాక త‌ప్ప‌లేదు. మ‌రీ ముఖ్యంగా 3డీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాంతో.. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 2.ఓ దుమ్ము దులిపేసింది. దాదాపు 8 కోట్ల వ‌సూళ్లు సాధించి నిర్మాత‌లు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఒక్క నైజాంలోనే దాదాపు 3.40 కోట్లు సాధించుకుంది 2.ఓ. వైజాగ్‌లో మ‌రో కోటి వ‌చ్చింది. సీడెడ్‌లో రూ.1.62 కోట్లు సాధించింది. సోమ‌వారం కూడా అడ్వాన్సు బుకింగుల క‌ళ‌క‌ళ క‌నిపిస్తోంది. వీక్ డేస్‌లోనూ.. 2.ఓ నిల‌దొక్కుకునే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

ALSO READ: టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ 'ఏఎమ్‌బి సినిమాస్‌'.!