ENGLISH

మహేష్‌ సరసన ముగ్గురు హీరోయిన్లట

24 November 2020-12:06 PM

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' సెట్స్‌ మీదకు త్వరలో వెళ్ళబోతోంది. కరోనా నేపథ్యంలో, సినిమా కాస్త లేటవుతోందిగానీ.. లేకపోతే, ఈపాటికే షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చేసేది. ఈ సినిమా కోసం ఇప్పటికే హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ పేరు ఖరారయ్యింది. మరో కీలకమైన పాత్ర కోసం అనుష్క పేరుని దర్శకుడు పరశురామ్‌ పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

 

కాగా, తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్‌ ప్రకారం చూస్తే ఈ సినిమాలో మరో హీరోయిన్‌కీ ఛాన్స్‌ వుందట. అది కూడా ఓ కీలకమైన పాత్రేనని అంటున్నారు. అయితే, మెయిన్‌ హీరోయిన్‌ రోల్‌ మాత్రం కీర్తి సురేష్‌దేననీ, మిగతా ఇద్దరూ కాస్సేపు తెరపై కన్పిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మూడో హీరోయిన్‌ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

ఈ పాత్ర కోసం రష్మిక పేరు పరిశీలనలో వుందట. అదే సమయంలో, బాలీవుడ్‌ నుంచి ఓ స్టన్నింగ్‌ బ్యూటీని ఇంపోర్ట్‌ చేసే అవకాశాలు కూడా వున్నాయట. ఆ మూడో హీరోయిన్‌కి ఓ పాట కూడా వుండనుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై చిత్ర దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. కొన్నాళ్ళ క్రితం 'సర్కారు వారి పాట' సినిమా కోసం శృతిహాసన్‌ని స్పెషల్‌ సాంగ్‌ కోసం తీసుకొస్తున్నట్లుగా ఊహాగానాలు విన్పించిన విషయం విదితమే. కానీ, అవన్నీ ఉత్త పుకార్లుగానే మిగిలిపోయాయి. మరిప్పుడు, ముగ్గురు హీరోయిన్లంటూ విన్పిస్తోన్న ప్రచారం ఏమవుతుందో.!

ALSO READ: Rashmika Mandanna Latest Photoshoot