ENGLISH

30 రోజుల్లో... 3 రోజుల జాత‌కం!

01 February 2021-13:29 PM

యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా అవ‌తారం ఎత్తిన సినిమా.. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌లైంది. తొలి రోజే ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. అయితే విచిత్రంగా.. ఈ సినిమాకి బంప‌ర్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ప్ర‌దీప్ యాంక‌ర్ గా సుప‌రిచితుడు కావ‌డం ఒక ఎత్త‌యితే, `నీలి నీలి ఆకాశం` పాట మ‌రో ఎత్తు. నిజానికి ఆ పాటే.. జ‌నాన్ని థియేట‌ర్ల‌కు తీసుకొచ్చింది. దాంతో... సినిమా ఫ్లాప్ అయినా.. వ‌సూళ్ల‌కు ఢోకా లేకుండా పోయింది. తొలి మూడు రోజుల్లో దాదాపు... 4.5 కోట్ల వ‌సూళ్లు తెచ్చుకుంది. మ‌రో 50 ల‌క్ష‌లు తెచ్చుకుంటే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లో ప‌డిపోయిన‌ట్టే.

 

30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా..?  3 రోజుల వ‌సూళ్ల వివ‌రాలివీ...

 

నైజాం  1.45 cr
సీడెడ్  0.77 cr
ఉత్తరాంధ్ర  0.49 cr
ఈస్ట్  0.33 cr
వెస్ట్  0.28 cr
కృష్ణా  0.30 cr
గుంటూరు  0.38 cr
నెల్లూరు  0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  4.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.15 cr
ఓవర్సీస్  0.14 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  4.51 cr

ALSO READ: ఆమ‌నికి ఏమైంది?