ENGLISH

ఆమ‌నికి ఏమైంది?

01 February 2021-12:06 PM

శుభ‌ల‌గ్నం, మావి చిగురు లాంటి చిత్రాల్లో విజృంభించిన న‌టించి, ఉత్త‌మ న‌టిగా అవార్డులు ఎగ‌రేసుకుపోయింది ఆమ‌ని. హీరోయిన్ గా ఉన్న‌ప్పుడు త‌న‌కు త‌గిన పాత్ర‌ల‌నే చేసి, గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు అమ్మ పాత్ర‌ల్లోనూ.. రాణిస్తోంది. ఇటీవ‌ల ఆమ‌ని న‌టించిన `అమ్మ దీవెన‌` విడుద‌లైంది. అయితే రెండ్రోజుల నుంచీ...ఆమ‌ని వార్త‌ల్లో ఉన్నారు. ఆమెకు ఆరోగ్యం స‌రిగా లేద‌ని, హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని, ఆసుప‌త్రిలో చేరార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. వీటిపై ఆమని ఓ వీడియో సందేశం పంపారు.

 

''రెండ్రోజులుగా నా ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మే. వాటిని న‌మ్మ‌కండి. ఓ షూటింగ్ లో నాకు ఫుడ్ పాయిజ‌న్ అయ్యింది. నాకే కాదు.. యూనిట్ అంద‌రూ ఫుడ్ పాయిజ‌న్ తో బాధ ప‌డ్డారు. ఇప్పుడు ఆరోగ్యం కుదురుగా ఉంది. అంతే త‌ప్ప‌... హార్ట్ ఎటాక్ కాదు...'' అని ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చారామె.

ALSO READ: కొత్త ట్రెండ్ సృష్టించిన బాల‌య్య‌