ENGLISH

ప్ర‌భాస్ సినిమాలో.. మ‌రో స్టార్‌!

01 February 2021-11:04 AM

ప్ర‌భాస్ మంచి స్వింగులో ఉన్నాడు. ఓ వైపు `రాధే శ్యామ్` ప‌ని ప‌డుతూనే, మ‌రోవైపు `స‌లార్‌` షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంకోవైపు `ఆదిపురుష్‌` క‌థా చ‌ర్చ‌ల్లోనూ పాలు పంచుకుంటున్నాడు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో సుమారు 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో.. `ఆదిపురుష్‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ల‌కు కొద‌వ లేకుండా చూసుకుంటోంది చిత్ర‌బృందం. రావ‌ణుడుగా సైఫ్ అలీ ఖాన్‌ని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే.

 

సీతగా కృతి స‌న‌న్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ల‌క్ష్మ‌ణుడిగా జాన్ అబ్ర‌హాంకి ఛాన్స్ ద‌క్కింద‌ట‌. ఇప్పుడు ఒక‌ప్ప‌టి బాలీవుడ్ క‌ల‌ల రాకుమారి హేమామాలినీకి కూడా చోటు ద‌క్కింద‌ని స‌మాచారం. కౌశ‌ల్యాదేవిగా హేమామాలిని క‌నిపించ‌బోతోంద‌ని టాక్ వినిపిస్తోంది.అయితే కొంత‌కాలంగా.. హేమా మాలిని మేక‌ప్పుల‌కు దూరంగా ఉన్నారు. ఎన్ని మంచి ఆఫ‌ర్లొచ్చినా చేయ‌డం లేదు. కానీ... ఆదిపురుష్ చేయాల‌ని ఆమె ఉత్సాహం చూపిస్తున్నార్ట‌. ఇటీవ‌ల ఓం రౌత్ - హేమామాలినిని క‌లిసి... పాత్ర విష‌యంలో చర్చ‌లు జ‌రిపార‌ని స‌మాచారం అందుతోంది.

ALSO READ: కొత్త ట్రెండ్ సృష్టించిన బాల‌య్య‌