ENGLISH

ఆర్య‌ని ఫిక్స్ చేసిన‌ట్టేనా?

01 February 2021-10:01 AM

`పుష్ష‌` షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆగ‌స్టు 13న పుష్ఫ‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ పుష్ష‌లో ప్ర‌ధాన విల‌న్ ఎవ‌ర్న‌ది ఇంకా తేల‌లేదు. ఈ సినిమాలో దాదాపు 9 మంది విల‌న్లుంటారు.కానీ ఒకే ఒక్క మెయిన్ విల‌న్ ఉంటాడు. ఆ పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్న‌ది ఇంకా సస్పెన్సే.

 

విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. ఆది పినిశెట్టిని కూడా అనుకున్నారు. ఆర్య పేరు చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆర్య‌నే విల‌న్ గా ఫిక్స్ చేశార‌ని వార్త‌లొస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆర్య పేరు అధికారికంగా ఖ‌రారు చేస్తార‌ని తెలుస్తోంది. ఆర్య గెట‌ప్ పోస్ట‌ర్ నీ విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. అల్లు అర్జున్ - సుకుమార్ హ్యాట్రిక్ కాంబోలో వ‌స్తున్న సినిమా ఇది. ర‌ష్మిక క‌థానాయిక‌. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు.

ALSO READ: కొత్త ట్రెండ్ సృష్టించిన బాల‌య్య‌