ENGLISH

యూట్యూబ్‌లో మ‌రో రికార్డ్!

03 September 2020-13:15 PM

తెలుగు సినిమాల హిందీ డ‌బ్బింగుల‌కు మంచి గిరాకీ వ‌స్తోంది. మ‌న‌వైన యాక్ష‌న్ చిత్రాల‌కు హిందీలో ఆద‌ర‌ణ బాగుంటోంది. తెలుగులో ఓ మాదిరిగా ఆడిన సినిమల్ని సైతం.. హిందీలో డ‌బ్ చేసి వ‌దిలితే... కోట్ల‌లో వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. తెలుగులో బిలో యావ‌రేజ్ గా నిలిచిన సినిమా `జ‌య‌జాన‌కీ నాయ‌క‌`. బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు.

 

ఈ సినిమాని హిందీలో డ‌బ్ చేసి వ‌దిలారు. ఈ చిత్రానికి ఏకంగా 300 మిలియన్స్ (30 కోట్లు) వ్యూస్ వచ్చాయి.ఈ మార్క్ దాటిన రెండో సినిమాగా నిలిచింది. తొలి స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `సరైనోడు` సినిమా ఉంది. ఈ రెండు సినిమాలను బోయపాటి శ్రీను తెరకెక్కించడం విశేషం.

ALSO READ: 2021లో... చిరు నుంచి రెండొస్తాయా?