ENGLISH

2021లో... చిరు నుంచి రెండొస్తాయా?

03 September 2020-12:05 PM

2020 మొత్తం క‌రోనా దెబ్బ‌కు కొట్టుకుపోతోంది. సినిమాల సంద‌డి లేదు. స్టార్ల హంగామా లేదు. ఓటీటీలే పెద్ద దిక్క‌య్యాయి. కానీ 2021లో ఆలోటు పూడ్చ‌డానికి స్టార్లు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా 2020లో సినిమా రాని లోటుని 2021లో తీర్చ‌డానికి రెడీ అయ్యార‌ని టాక్‌. ప్ర‌స్తుతం చిరంజీవి `ఆచార్య‌` గా సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 వేస‌విలో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంది. ఆ వెంటనే చిరు `లూసీఫ‌ర్‌` రీమేక్ ని మొద‌లెడ‌తార‌ని స‌మాచారం. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన చిత్ర‌మిది.

 

తెలుగులో వి.వి.వినాయ‌క్ తో రీమేక్ చేయిస్తున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. 2021 వేస‌విలోనే ఈ చిత్రాన్ని మొద‌లెడ‌తారు. 2021 చివ‌ర్లో ఈ సినిమాని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. అంటే... 2021లో చిరు నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయ‌న్న‌మాట‌. ఆచార్య షూటింగ్ ఆల‌స్య‌మై... విడుద‌ల లేట్ అయితే త‌ప్ప - లూసీఫ‌ర్ 2021లో రావ‌డం ఖాయం.

ALSO READ: లిప్ లాక్ పేరుతో చీటింగ్ చేశారా?