ENGLISH

ఏ 1 ఎక్స్‌ప్రెస్‌.... మూడు రోజుల వ‌సూళ్లెంత‌?

08 March 2021-09:30 AM

ఈవారం దాదాపు అర‌డ‌జ‌ను సినిమాలు సినిమాలొచ్చాయి. వాటిలో... ఏ1 ఎక్స్‌ప్రెస్‌కే వ‌సూళ్లు ఎక్కువ వ‌స్తాయ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. దానికి త‌గ్గ‌ట్టుగానే.. ఏ1 ఎక్స్‌ప్రెస్ తొలి మూడు రోజుల్లోనూ మంచి వ‌సూళ్లేరాబ‌ట్టింది. ఈ వీకెండ్ 3 కోట్ల‌కుపైగానే షేర్ వ‌చ్చింద‌ని చిత్ర వ‌ర్గాలు అధికారికంగా ప్ర‌క‌టించాయి.

 

నైజాంలో 97 ల‌క్ష‌లు, సీడెడ్‌లో 31 ల‌క్ష‌లు, నెల్లూరులో 15 ల‌క్ష‌లు, కృష్ణాలో 27 ల‌క్ష‌లు, గుంటూరులో 26 లక్ష‌లు, వైజాగ్ లో 43 ల‌క్ష‌లు, ఈస్ట్ 29 ల‌క్ష‌లు, వెస్ట్ 21 ల‌క్ష‌లు, క‌ర్నాట‌క 10లక్ష‌లు... వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ సినిమా థియేట‌రిక‌ల్ రైట్స్ 4 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయాయ‌ని, ఆ లెక్క‌న బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన సినిమాల‌కు మౌత్ ప‌బ్లిసిటీ ఉన్నా, వ‌సూళ్లు ఆశాజ‌న‌కంగా లేవు. మ‌రి ఈ వీక్ డేస్‌లో.. ఏ1 ఎక్స్‌ప్రెస్ ఏమేర‌కు ప్ర‌భావితం చూపిస్తుందో చూడాలి.

ALSO READ: నెట్ ఫ్లిక్స్‌కి న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చారా?