ENGLISH

బాలీవుడ్ లోకి లోకేష్

23 August 2024-14:59 PM

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే సౌత్ అనేలా ఉంది మార్కెట్. ఒకప్పుడు హిందీ సినిమాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పడు సౌత్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. దక్షిణాది సినిమాలకే కాదు, హీరోలకి , దర్శకులకి, హీరోయిన్స్ కి కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్లతో వర్క్ చేసేందుకు బాలీవుడ్ హీరోలు , దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు సౌత్ దర్శకుల ప్రతిభకి బాలీవుడ్ హీరోలు ఫిదా అవుతున్నారు. కారణం సౌత్ సినిమాలు ప్రజాదరణకు నోచుకోవటమే.   


తమిళ దర్శకుడు అట్లీ, జవాన్ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. షారుక్ లాంటి హీరోతో వర్క్ చేసిన అట్లీ నెక్స్ట్ సల్మాన్ తో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ కూడా సల్మాన్ ఖాన్ తో 'సికందర్' సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా లోకేష్ కనక రాజ్ కూడా బాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో'తో తిరుగులేని విజయాలు సాధించిన లోకేష్ పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచుకున్నాడు. అలాంటి లోకేష్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ ఒక సినిమా చేయనున్నాడని టాక్. 


లోకేష్ , అమీర్ కాంబోలో ఒక పానిండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీని  మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' తర్వాత ఆమిర్ ఖాన్ నుంచి ఇంకో సినిమా లేదు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో అమీర్ సినిమా అనేసరికి ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ ఏర్పడింది.