ENGLISH

ఆట విన్నర్ టీనా మృతి

12 May 2022-15:37 PM

ఓంకార్ హోస్ట్ గా చేసిన ఆట షో చాలా పాపులర్ అయ్యింది. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది.. ఈ విషయాన్ని ఆట సందీప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు.

 

టీనా మరణవార్త వినగానే షాక్ కి గురయ్యానని, చాలా బాధగా ఉందని తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ.. ఆమె ఆత్మకి శాంతి చేకూరలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లో రాసుకొచ్చాడు కాగా ఆట సీజన్‌-1విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్‌-4కి జడ్జిగా వ్యవహరించారు. టీనా మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ: 'సర్కారు వారి పాట' మూవీ రివ్యూ & రేటింగ్!