ENGLISH

స‌ర్కారు వారి పాట‌.. తొలిరోజే రికార్డుల వేట‌

13 May 2022-10:06 AM

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య గురువారం స‌ర్కారు వారి పాట విడుద‌లైంది. తొలి రోజు... తొలి ఆట‌కు డివైడ్ టాక్ రావ‌డం.. మ‌హేష్ అభిమానుల్ని క‌ల‌వ‌రపెట్టింది. అయితే అవేం... వ‌సూళ్ల ప్ర‌భంజ‌నాన్ని అడ్డుకోలేక‌పోయాయి. తొలిరోజే.. స‌ర్కారు వారి పాట రికార్డుల వేట మొద‌లెట్టేసింది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో క‌లిపి దాదాపు 37 కోట్లు వ‌సూలు చేసింది. ఇది నాన్‌... ఆర్‌.ఆర్‌.ఆర్ రికార్డ్ అని (పాండ‌మిక్ త‌ర‌వాత‌) చిత్ర‌బృందం ప్ర‌క‌టించేసింది.

 

ఏరియాల వారిగా..

 

నైజాంలో 12.5 కోట్లు

సీడెడ్‌లో 4.8 కోట్లు

ఉత్త‌రాంధ్ర‌లో 3.9 కోట్లు

ఈస్ట్ లో 3.3 కోట్లు

వెస్ట్ లో 2.76 కోట్లు

గుంటూరు 5.9 కోట్లు

కృష్ణ 2.58 కోట్లు

నెల్లూరులో... 1.56 కోట్లు

 

ఇలా మొత్తానికి 37 కోట్ల షేర్ వ‌సూలు చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌ట్టాయి. ఓవ‌ర్సీస్‌లోనూ తొలి రోజు ప్రీమియ‌ర్ల‌తోనే రికార్డు వ‌సూళ్లు సాధించిన‌ట్టు చెబుతున్నారు. ఆ లెక్క‌లు పూర్తిగా బ‌య‌ట‌కు రావాల్సివుంది. శుక్ర‌, శ‌ని, ఆదివారాలు ఎంత‌టి వ‌సూళ్లు రాబ‌ట్టుకుంటుంది..? అనేదాన్ని బ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమా స్థాయి అంచ‌నా వేయొచ్చు. 

 

ALSO READ: 'సర్కారు వారి పాట' మూవీ రివ్యూ & రేటింగ్!