ENGLISH

అబిజీత్‌ సూపర్బ్‌ క్లారిటీతో వున్నాడు

24 December 2020-17:00 PM

బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి సంబంధించినంతవరకు రెండో సీజన్‌ విన్నర్‌ కౌశల్‌ మండా తర్వాత, ఆ స్థాయిలో అన్ని విషయాలపైనా క్లారిటీ వున్న కంటెస్టెంట్‌ అబిజీత్‌.. అందుకే నాలుగో సీజన్‌లో విన్నరగా నిలిచాడు. తనపై అభిమానం చూపిస్తోన్న లక్షలాదిమంది అభిమానుల విషయంలోనూ, ప్రైజ్‌ మనీ విషయంలోనూ, కుటుంబ విలువల విషయంలోనూ, ఇతర కంటెస్టెంట్స్‌ విషయంలోనూ ఖచ్చితమైన అభిప్రాయాలతో వున్నాడు అబిజీత్‌.

 

'ప్రైజ్‌ మనీ ఎంత వచ్చిందన్నది నాకు ముఖ్యం కాదు. నన్ను ప్రేక్షకులు ఓట్లేశారు.. నేను గెలవడమంటే, వారిని గెలిపించడమే.. ఈ క్రమంలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మానసికంగా దృఢంగా వుండడం బిగ్‌ హౌస్‌లో ముఖ్యమని గ్రహించాను. అందుకే, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు నన్ను నేను మానసికంగా బలంగా వుంచుకునేందుకు ప్రయత్నించాను. అవసరమైనప్పుడు టాస్క్‌లలోనూ ఫిజికల్‌గా పెర్ఫామెన్స్‌ ఇచ్చాను..' అని చెప్పాడు అబిజీత్‌. 'త్వరలోనే అభిమానుల్ని కలగబోతున్నాను.. తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల పర్యటిస్తాను..' అని మరో ప్రశ్నకు అబిజీత్‌ సమాధానమిచ్చాడు. 'నేనిలా వుండడానికి కారణం మా అమ్మ.

 

ప్రతి ఇంట్లోనూ అమ్మ కీలక బాధ్యతలు తీసుకుంటుంది..' అని చెప్పిన అబిజీత్‌, 'కంటెస్టెంట్స్‌ ఎవరితోనూ వ్యక్తిగత విభేదాల్లేవు. హౌస్‌లో ఏవేవో జరిగాయి. అవి అక్కడే మర్చిపోయాను. అందరితోనూ నాకు ఒకే తరహా స్నేహం వుంది. కొందరితో ఇంకాస్త ఎక్కువ స్నేహం వుంటుందంతే..' అని స్పష్టం చేశాడు.

ALSO READ: సోహెల్ కొట్టేశాడు ఛాన్స్..!