ENGLISH

పాతిక ల‌క్ష‌లు పోయినందుకు బాధ లేద‌ట‌!

25 December 2020-10:11 AM

బిగ్ బాస్ 4 విన్న‌ర్ గా నిలిచాడు అభిజిత్‌. ముందు నుంచీ అభిజితే హాట్ ఫేవ‌రెట్. అయితే.. ఫైన‌ల్ పోరులోఇ కాంపిటేష‌న్ ట‌ఫ్ గా మారింది. అయినా స‌రే, అభిజిత్ ట్రోఫీ అందుకున్నాడు. అయితే... విన్న‌ర్ కి రావాల్సిన 50 ల‌క్ష‌ల స్థానంలో 25 ల‌క్ష‌లే ద‌క్కాయి. టాప్ 3 లో ఉన్న‌ప్పుడు సోహైల్ 25 లక్ష‌ల‌తో పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో, అభిజిత్ ప్రైజ్ మ‌నీలో కోత ప‌డింది. దాంతో గెలిచినా అభిజిత్ కి క్యాష్ ప్రైజ్ విష‌యంలో సంతృప్తి ద‌క్క‌లేదు. ఎందుకంటే గెలిచిన అభిజిత్ కీ, ఓడిపోయిన సోహైల్ కీ ఒక‌టే ప్రైజ్ మ‌నీ వ‌చ్చిన‌ట్టైంది. దాంతో ఈ విష‌యంలో అభిజిత్‌కి అన్యాయం జ‌రిగింద‌ని అభి ఫ్యాన్స్‌, బిగ్ బాస్ ఫాలోవ‌ర్స్ ఫీల‌య్యారు.

 

అయితే.. ప్రైజ్ మ‌నీ త‌గ్గిన విష‌యంలో త‌న‌కెలాంటి అసంతృప్తీ లేద‌ని, ఈ విష‌యం గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన ప‌నిలేద‌ని అభిజిత్ స్ప‌ష్టం చేశాడు. ``డ‌బ్బులు ఈరోజు ఉంటాయి. రేపు ఖ‌ర్చ‌యిపోతాయి. బిగ్ బాస్ 4 సీజ‌న్ విన్న‌ర్ ఎప్ప‌టికీ నేనే. నాకు ఇవ్వాల్సిన ప్రైజ్ మ‌నీ త‌గ్గించార‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు అనుకుంటే.. ఆ సంగతి వాళ్లే చూసుకుంటారు. నేను మాత్రం అడ‌గ‌ను`` అని క్లారిటీగా చెప్పేశాడు.

ALSO READ: ప్ర‌భాస్ ప‌క్క‌న మ‌రో స్టార్ హీరోయిన్?