ENGLISH

ప్ర‌భాస్ ప‌క్క‌న మ‌రో స్టార్ హీరోయిన్?

25 December 2020-09:02 AM

ప్ర‌భాస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. రాధేశ్యామ్ ఇంకా పూర్త‌వ‌కుండానే.. స‌లార్ ని ప‌ట్టాలెక్కించేయ‌బోతున్నాడు. ఇటీవ‌లే `స‌లార్`కి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కేజీఎఫ్ తో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాకి దర్శ‌కుడు. జ‌న‌వ‌రి 18 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా దిశాప‌టానీని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. అయితే మ‌రో క‌థానాయిక‌కీ చోటుంద‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌లో ఓ స్టార్ హీరోయిన్ క‌నిపించ‌బోతోంద‌ట‌. ఆ పాత్ర కోసం ఎవ‌రిని ఎంచుకుంటార‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.

 

`స‌లార్‌` ఓ పాన్ ఇండియా సినిమా. ఇందులో పాన్ ఇండియా స్టార్లే ఉంటారు. దిశా ప‌టానికి అంత క్రేజ్ లేదు. తాను ఓ ఫ్లాప్ హీరోయిన్‌. త‌న‌కి ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావ‌డం గొప్ప విష‌య‌మే. రెండో క‌థానాయిక పాత్ర మాత్రం అలా కాదు. ఆమె పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ని తెలుస్తోంది. అందుకే.. ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ని ఎంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. మ‌రో కీల‌క‌మైన పాత్ర కోసం.. మోహ‌న్ లాల్ ని సంప్ర‌దించార‌ని ప్ర‌చారం జరుగుతోంది. అవ‌న్నీ నిజాలో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ: Disha Patani Latest Photoshoot