ENGLISH

ఓటీటీ మేనియా తగ్గుతుందా.? లేదా.?

24 December 2020-18:00 PM

సినిమా థియేటర్లు తెరచుకుంటున్నాయ్‌. మరి, ఓటీటీల్లో సినిమా రిలీజ్‌ల జోరు తగ్గుతుందా.? లేదా.? అంటే, ప్రస్తుతానికైతే తగ్గే అవకాశాలు కన్పించడంలేదు. సినిమా థియేటర్లు తెరచుకున్నా, ఓటీటీల్లో సినిమాలు రిలీజవడం ఆగదంటూ పలువురు సినీ ప్రముఖులు ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ - సినిమా నిర్మాతల మధ్య తెరవెనుకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయట.

 

కరోనా సెకెండ్‌ వేవ్‌, న్యూ స్ట్రెయిన్‌.. అంటూ జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో 'ఇరువురికీ లబ్ది పొందే ఫార్ములా'పై ఈ చర్చలు జరుగుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలైనా, అవి పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చేరడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టమైన వ్యవహారం. 'లైఫ్‌ రిస్క్‌ చేసి, థియేటర్లలో సినిమా చూడటం అవసరమా.?' అన్న భావన చాలామంది ప్రేక్షకుల్లో వుంది.

 

అయితే, ఓటీటీ ద్వారా సినిమా చూసేదానికీ, థియేటర్లలో సినిమా చూసేదానికీ చాలా తేడా వుంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకో ఆప్షన్‌ లేదు. దాంతో, మధ్యేమార్గంగా ఓటీటీ - సినిమా నిర్మాతల మధ్య ఓ ఒప్పందం కుదిరే అవకాశం వుందని సమాచారం. ప్రేక్షకులు కూడా, సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లోనూ సినిమా రిలీజైతే మంచిదన్న భావనతో వున్నట్లు తెలుస్తోంది. రేపు 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న దరిమిలా, ఆ సినిమా రిజల్ట్‌ తర్వాత.. ఓటీటీ వ్యవహారాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది.

ALSO READ: సోహెల్ కొట్టేశాడు ఛాన్స్..!