ENGLISH

ఆచార్య కాపీ క‌థో.. కాదో తేలిపోతుంది

26 April 2022-10:11 AM

ఓ పెద్ద సినిమా మొద‌ల‌వ్వ‌గానే, లేదంటే టైటిలో, టీజ‌రో బ‌య‌ట‌కు రాగానే `ఈ క‌థ నాదే` అంటూ మీడియాకెక్కేవాళ్లు కొంత‌మంది క‌నిపిస్తారు. గ‌తంలో ఇలా చాలాసార్లు జ‌రిగింది. `ఆచార్య‌`కూ ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఆచార్య క‌థ నాదే అని యేడాది క్రిత‌మే ఓ ర‌చ‌యిత మీడియాకి ఎక్కాడు. ఆ స‌మ‌యంలో కొర‌టాల కూడా మీడియా ముందుకొచ్చి `నా క‌థ వేరు. నీ క‌థ వేరు` అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే అదే స‌మ‌యంలో.. `నా సినిమా రిలీజ్ అయ్యాక‌.. అది నీ క‌థే అని తేలితే.. ఎలాంటి శిక్ష అయినా అనుభ‌విస్తా` అని మీడియా స‌మ‌క్షంలోనే చెప్పారు.

 

ఇప్పుడు ఆచార్య రిలీజ్ అవుతోంది. మ‌రో రెండు రోజుల్లో బొమ్మ ప‌డిపోతుంది. ఇప్పుడు క‌థ‌.. కొర‌టాల‌దేనా, లేదంటే కాపీ క‌థా? అనేది తేలిపోతుంది. అయితే.. అప్ప‌ట్లో హడావుడి చేసిన ర‌చ‌యిత, విడుద‌ల‌కు ముందు సైలెంట్ అయిపోయాడు. అత‌ని అలికిడి ఎక్క‌డా లేదు. బ‌హుశా.. సినిమా రిలీజ్ అయ్యాక మ‌ళ్లీ ప్ర‌త్య‌క్షం అవుతాడేమో చూడాలి. ఇది వ‌ర‌కు `భ‌ర‌త్ అనే నేను`, `శ్రీ‌మంతుడు` సినిమాల‌కూ ఇలానే... కాపీ అనే నింద‌లు మోశాడు కొర‌టాల‌. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు కూడా. ఈసారీ అదే జ‌ర‌గ‌బోతోందన్న‌మాట‌.

ALSO READ: మెగాస్టార్ కి హీరోయిన్ లేదు