ENGLISH

ప‌వ‌న్ కోసం కొర‌టాల క‌థ‌

26 April 2022-11:10 AM

వ‌రుస విజ‌యాల‌తో.. తిరుగులేని స్థాయి తెచ్చుకున్నారు కొర‌టాల శివ‌. నూటికి నూరు శాతం విజ‌యాల రేటు ఉన్న ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌, చిరంజీవి ఇలా వ‌రుస‌గా స్టార్ల‌తోనే చేస్తున్నారు. ఆయ‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌ని కోరిక‌. అందుకోసం ఆయ‌న ఓ క‌థ రాసుకున్నార్ట‌. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సాగే క‌థ అని, అందులో ప‌వ‌న్‌ని ఓ మంచి లీడ‌ర్ గా చూపిస్తూ క‌థ రాసుకున్నాన‌ని కొర‌టాల చెబుతున్నారు.

 

``ప‌వ‌న్ తో ఓ సినిమా చేయాల‌ని ఉంది. అందుకోసం ఓ శ‌క్తిమంత‌మైన క‌థ రాసుకున్నా. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సాగే ఆ క‌థ‌లో ప‌వ‌న్‌ని ఓ మంచి నాయ‌కుడిగా చూపించాల‌నుకున్నా. కానీ.. రాజ‌కీయంగా ప‌వ‌న్ చాలా బిజీ అయిపోవ‌డంతో మా ప్రాజెక్ట్ కుద‌ర్లేదు. ఇప్పుడు ఆయ‌న సినిమాలు చేస్తున్నారు క‌దా.. చూడాలి. ఆ అవ‌కాశం ఎప్పుడొస్తుందో`` అని చెప్పుకొచ్చారు కొర‌టాల‌. ప‌వ‌న్ ఇప్పుడు సినిమాల‌పై కూడా బాగానే ఫోక‌స్ చేస్తున్నాడు. స్క్రిప్టు రెడీగా ఉంటే.. ఎవ‌రితోనైనా సినిమా చేసేస్తున్నాడు. ఆ దారిలోనే కొర‌టాల‌కు పిలుపు వ‌స్తుందేమో చూడాలి.

ALSO READ: మెగాస్టార్ కి హీరోయిన్ లేదు