ENGLISH

ఆచార్య మ‌రీ ఇంత అరాచ‌క‌మా?

04 March 2021-11:00 AM

చిరంజీవి సినిమా అంటే.. ఆ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. పైగా.. కొర‌టాల శివ‌కు వ‌రుస‌గా అన్నీ విజ‌యాలు. ఒక‌దాన్ని మించి మ‌రో హిట్టు. దాంతో.. స‌హ‌జంగానే `ఆచార్య‌`పై అంచ‌నాలు పెరిగిపోయాయి. దానికి త‌గ్గ‌ట్టే బిజినెస్ విష‌యంలో దుమ్ము దులుపుతోంది ఈసినిమా. అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. శాటిలైట్ హ‌క్కులు అమ్మాల్సివుంది.

 

అయితే... శాటిలైట్ కోసం ఏకంగా 80కోట్లు డిమాండ్ చేస్తున్నార్ట నిర్మాత‌లు. అంత మొత్తంలో ఈ సినిమా హ‌క్కుల్ని కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. క‌నీసం 60 కోట్ల‌కు అమ్ముడైనా.. అది రికార్డు ధ‌రే. బాహుబ‌లి త‌ప్ప‌.. ఏ సినిమాకీ ఈ స్థాయి ధ‌ర‌కు అమ్ముడు కాలేదు. చిరు గ‌త చిత్రాల‌కూ ఈ రేటు రాలేదు.

 

నిర్మాత‌లు మ‌రీ అత్యాశ‌కు పోతున్నార‌ని, ఇంతింత పెద్ద రేట్ పెట్టి, శాటిలైట్ ఇప్పుడు ఎవ‌రూ కొన‌డం లేద‌ని, ఓటీటీలు వ‌చ్చాక టీవీల్లో సినిమా చూడ‌డం బాగా త‌గ్గిపోయింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మ‌రి.. ఆచార్య నిర్మాత‌ల వ్యూహం ఏమిటో?

ALSO READ: ముంబైలో సెటిల్ అయిపోతాడా?