ENGLISH

మ‌రీ అంత చీప్ గా క‌నిపిస్తున్నానా?

04 March 2021-10:14 AM

చేతిలో హిట్లుంటేనే.. పారితోషికాలు. లేదంటే.. గీచి గీచి మ‌రీ బేరాలాడ‌తారు. తెలుగు అమ్మాయిలంటే మ‌రీనూ. తెలుగులో హీరోయిన్లు లేరు.. లేరంటూ విమ‌ర్శ‌లు చేస్తుంటారు గానీ, ఉన్న‌వాళ్ల‌ని అస్స‌లు ప‌ట్టించుకోరు. తెలుగ‌మ్మాయిల‌కు ఇచ్చే పారితోషికాలూ త‌క్కువే. అయినా స‌రే, వాళ్లు ఎడ్జెస్ట్ అయిపోతుంటారు. అయితే ఈమ‌ధ్య ఈషా రెబ్బా త‌న‌కు త‌గినంత పారితోషికం ఇవ్వ‌డం లేద‌న్న ఏకైక కార‌ణంతో.. సినిమాని వ‌దిలేసింద‌ట‌. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌ల‌మ్‌` అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

 

స‌మంత క‌థానాయిక‌. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం ఈషా రెబ్బాని సంప్రందించారు. తాను కూడా ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది. అయితే... ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తాను త‌ప్పుకున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. దానికి కార‌ణం.. పారితోషికం న‌చ్చ‌క‌పోవ‌డ‌మే అట‌. ``నేను మ‌రీ అంత చీప్ గా క‌నిపిస్తున్నానా? నాకు మ‌రీ అంత త‌క్కువ పారితోషికం ఇస్తారా`` అంటూ చిరుబుర్రులాడుతూ ఈ సినిమాని వ‌దులుకుంద‌ట ఇషారెబ్బా. ఈషాకి పెద్ద‌గా సినిమాలేం లేవు. ఆమె డిమాండ్ అంతంత మాత్ర‌మే. అయినా స‌రే, పారితోషికం విష‌యంలో నిక్క‌చ్చిగానే ఉంటోంది. దానికి ఇదే తాజా ఉదాహ‌ర‌ణ‌.

ALSO READ: Eesha Rebba Hot Photoshoot