ENGLISH

ముంబైలో సెటిల్ అయిపోతాడా?

04 March 2021-09:06 AM

ప్ర‌భాస్ ఇప్పుడు టాలీవుడ్ హీరో కాదు. ఓ పాన్ ఇండియా స్టార్‌. త‌న సినిమా అంటే.. బాలీవుడ్ లోనూ క్రేజ్ మొద‌లైపోతుంది. అందుకే... బాలీవుడ్‌కి మ‌రింత ద‌గ్గ‌ర కావాల‌నుకుంటున్నాడు ప్ర‌భాస్. అందులో భాగంగానే... ముంబైలో ఓ ఇల్లు కొనాల‌ని చూస్తున్నాడ‌ట‌. ముంబైలోని ఖ‌రీదైన నివాస స్థ‌లంలో.. ఓ ఇంటికి కొనుగోలు చేయాల‌ని.. ప్ర‌భాస్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఇంటిని కొనే బాధ్య‌త‌... `ఆదిపురుష్‌` నిర్మాత‌ల‌కు అప్ప‌గించాడ‌ట‌.

 

`ఆదిపురుష్‌`తో అందుకునే పారితోషికంతోనే.. ప్ర‌భాస్ ముంబైలో ఇల్లు కొంటున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ప్ర‌భాస్ పారితోషికం ఇప్పుడు 100 కోట్ల‌కు పైమాటే. ఇత‌ర‌త్రా రూపాల్లో ప్ర‌భాస్ బాగానే ఆర్జిస్తున్నాడు. అలాంటి ప్ర‌భాస్ ముంబైలో ఇల్లు కొన‌డం విచిత్ర‌మేమీ కాదు. కాక‌పోతే... ప్ర‌భాస్ అక్క‌డే సెటిలైపోతాడా? చుట్ట‌పు చూపుగా హైద‌రాబాద్ వ‌చ్చిపోతుంటాడా? అనే అనుమానాలు మొద‌లైపోయాయిప్పుడు.

ALSO READ: ఈవారం మ‌రో ఆరు సినిమాలు