ENGLISH

ఆచార్య‌నా... మ‌జాకానా?!

03 February 2021-09:24 AM

ఓట‌మంటే ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ఆయ‌న క‌థ‌ల్లో సామాజిక కోణం ఉంటూనే, క‌మ‌ర్షియ‌ల్ గా రంజింప‌జేస్తాయి. ఇక కొర‌టాల‌కు చిరంజీవి లాంటి హీరో దొరికితే... ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. అందుకే `ఆచార్య‌`పై భారీ అంచ‌నాలు నెల‌కున్నాయి. ఇటీవ‌లే.. టీజ‌ర్ కూడా వ‌చ్చింది. అందులో చిరు చెప్పిన డైలాగ్.. ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిపోయింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌డంతో.... ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ వైపు టాలీవుడ్ బాగా ఫోక‌స్ చేస్తోంది. టీజ‌ర్ బ‌య‌ట‌కు రాగానే.. సినిమాకి సంబంధించిన బిజినెస్‌మొద‌లైపోయింది.

 

కొన్ని ఏరియాలు ఇప్ప‌టికే ఫైన‌ల్ అయిపోయాయ‌ని తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమా 35 కోట్ల‌కు అమ్ముడుపోయే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఇది వ‌ర‌కు చిరుకు నైజాం మార్కెట్ 20 కోట్ల‌కు లోపే. ఈ సినిమా అది 35 కోట్ల‌కు చేరుకోవ‌డం ట్రేడ్ వ‌ర్గాల్ని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వేస‌వి బరిలో... ఈ సినిమా ఉండ‌డం కూడా బాగా క‌లిసొస్తోంది. అందుకే.. క‌నీ వినీ ఎరుగ‌ని రేట్ ఇవ్వ‌డానికి బ‌య్య‌ర్లు మొగ్గు చూపిస్తున్నార‌ని టాక్‌.

ALSO READ: ఆదిపురుష్ సెట్లో అగ్ని ప్ర‌మాదం