ENGLISH

ఆచార్య‌కీ త‌ప్ప‌ని క‌ష్టాలు.. రిలీజ్ వాయిదా?

12 April 2021-15:32 PM

క‌రోనా క‌ష్టాల‌తో... టాలీవుడ్ కుదేలైపోతోంది. వ‌రుస‌గా సినిమాలు వాయిదా ప‌డుతున్నాయి. ఈ ప్ర‌భావం మే లో రాబోయే సినిమాల‌పై కూడా ప‌డ‌బోతోంది. అందులో భాగంగా చిరంజీవి `ఆచార్య‌` కూడా వాయిదా ప‌డిపోయింద‌ని టాక్‌. మే 13న రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు రిలీజ్ డేట్ మారే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. మే 13న ఈ సినిమా రావ‌డం అసాధ్య‌మ‌ని తేలింది. అందుకే ప్ర‌త్యామ్నాయంగా చిత్ర‌బృందం మ‌రో డేట్ ని కూడా అట్టి పెట్టుకుంది. అదే... జూన్ 18. ఈ కొత్త డేట్ ని త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

 

ఆచార్య వాయిదా ప‌డ‌డానికి క‌రోనా ఒక్క‌టే కార‌ణం కాదు.చాలా కారణాలున్నాయి. షూటింగ్ ఇంకా 30 శాతం బాకీ ఉంద‌ని టాక్‌. పైగా సీజీ వ‌ర్క్స్ అవ్వ‌లేదు. అవ‌న్నీ ఎప్పుడు అవుతాయో తెలీదు. కంగారు కంగారుగా సీజీలు చేసి, షూటింగులు అవ్వ‌గొట్టి మేలో విడుద‌ల చేయాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని చిత్ర‌బృందం భావించింది. అందుకే ఇంకొంత స‌మ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు టాక్‌. మేలో ఇంకొన్ని సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య రిలీజ్ డేట్ మారితే.. ఆ డేట్లూ మారే ఛాన్సుంది.

ALSO READ: లెక్క‌లు చెప్పొద్దంటూ దిల్ రాజు వార్నింగ్‌