ENGLISH

గ‌ప్ చుప్‌గా `ఆచార్య` షూటింగ్‌!

14 December 2020-11:23 AM

లాక్ డౌన్ త‌ర‌వాత‌... మొద‌ల‌వ్వాల్సిన `ఆచార్య‌`.. క‌రోనా కార‌ణంగా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. చిరుకి క‌రోనా సోకింద‌న్న వార్త రావ‌డంతో.. ఆయ‌న కొన్ని రోజులు బ‌య‌ట‌కు రావ‌డానికి ఇష్ట ప‌డ‌లేదు. ఆ త‌ర‌వాత చిరుకి క‌రోనా నెగిటీవ్ అని తేలినా, చిరు `ఆచార్య‌` సెట్లో కి అడుగు పెట్ట‌డం లేద‌ని, సంక్రాంతి త‌ర‌వాతే.. ఆయ‌న షూటింగ్ లో పాల్గొంటార‌ని చెప్పారు. అయితే నిజానికి చిరుతో ఆచార్య షూటింగ్ ఎప్పుడో మొద‌లైపోయింద‌ట‌.

 

గ‌ప్ చుప్ గా క్లైమాక్స్ ఫైటింగులు కూడా తీసేశార‌ని టాక్‌. మరో షెడ్యూల్ ఈ రోజు నుంచే మొద‌ల‌వుతుంద‌ని, ఈనెలాఖ‌రు వ‌ర‌కూ ఆచార్య షూటింగ్ జ‌రుగుతుంద‌ని, ఈ యేడాది వేస‌విలో త‌ప్ప‌కుండా ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న ఉద్దేశంతో చిత్ర‌బృందం ఉంద‌ని స‌మాచారం. అయితే రామ్ చ‌ర‌ణ్, కాజ‌ల్ లు ఎప్ప‌టి నుంచి సెట్లోకి వ‌స్తార‌న్న విష‌యం ఇంకా తేల‌లేదు. అతి త్వ‌ర‌లోనే కాజ‌ల్ కూడా ఆచార్య షూటింగ్ లో పాలు పంచుకునే అవ‌కాశం వుంది.

ALSO READ: గ్రాండ్ మాస్ట‌ర్‌.. ఎవ‌రా సూప‌ర్ స్టార్‌