ENGLISH

న‌క్స‌ల్ లీడ‌ర్ గా మారిన రానా

14 December 2020-10:14 AM

రానా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. హీరోగా క‌నిపించాల‌న్న రూలేం పెట్టుకోలేదు. త‌న శ‌క్తి సామార్థ్యాల్ని ప‌రీక్షించే ఏ పాత్ర అయినా ఓకే. అందుకే న‌టుడిగా ఎదుగుతున్నాడు. తాను చేస్తున్న మ‌రో సినిమా `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్ కూడా‌ కీలక పాత్ర పోషిస్తోంది. ‘సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ రూపొందిస్తున్నారు.

 

ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా రానా లుక్ విడుద‌ల చేశారు. ఇందులో రానా చేతిలో గ‌న్‌తో న‌క్స‌లైట్ అవ‌తారంలో క‌నిపిస్తున్నారు. ఇందులో ర‌వి అన్న అనే న‌క్స‌లైట్ లీడ‌ర్‌గా రానా తెర‌పై క‌నిపించ‌నున్నాడ‌ని చిత్రబృందం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది.

ALSO READ: గ్రాండ్ మాస్ట‌ర్‌.. ఎవ‌రా సూప‌ర్ స్టార్‌