ENGLISH

గ్రాండ్ మాస్ట‌ర్‌.. ఎవ‌రా సూప‌ర్ స్టార్‌

14 December 2020-09:18 AM

బ‌యోపిక్‌ల ప‌రంప‌ర‌లో మ‌రో సినిమా త‌యారు కానుంది. ఈసారి విశ్వ‌నాథ‌న్ ఆనంద్ జీవిత క‌థ‌ని తెర‌పై తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏకంగా ఐదు సార్లు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారాయన. త‌న జీవితంలో చాలా ఎత్తు ప‌ల్లాలున్నాయి.

 

ఆనంద్‌‌ జీవితంలోని పలు ఆసక్తికర ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ బాలీవుడ్ లో ఓ స్క్రిప్టు రెడీ అయ్యింది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తారు. మహావీర్‌జైన్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌తో‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని త్వరలో ప్రకటించబోతున్నారు.

ALSO READ: మహేష్‌తో వంశీ ఆ ప్లానింగ్‌లో వున్నాడా.?