ENGLISH

మహేష్‌తో వంశీ ఆ ప్లానింగ్‌లో వున్నాడా.?

13 December 2020-17:18 PM

వంశీ పైడిపల్లి, హీరో మహేష్‌బాబుకి ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మహర్షి' మంచి విజయాన్ని అందుకుంది. మరోమారు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటూ ప్రచారం జరిగినా, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఇదిలా వుంటే, ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కోసం వంశీ పైడిపల్లి సన్నాహాలు చేస్తున్నాడనీ, మహేష్‌ నటించే ఈ సినిమా కోసం వంశీ ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలైపోయి వున్నాడనీ అంటున్నారు.

 

అన్నీ కుదిరితే, వచ్చే సంక్రాంతికే మహేష్‌ - వంశీ కాంబినేషన్‌లో కొత్త సినిమా డిటెయిల్స్‌ వెల్లడవుతాయట. ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. అయితే, పాన్‌ ఇండియా సినిమాల విషయమై మహేష్‌ ఆలోచనలు ఇంకోలా వున్నాయి. బాలీవుడ్‌ నుంచి ఇప్పటికే పలు ఆఫర్స్‌ వచ్చినా, మహేష్‌ సున్నితంగా తిరస్కరించిన విషయం విదితమే. అయితే, మహేష్‌ సినిమాలు తెలుగుతోపాటు, ఇతర భాషల్లోకి డబ్‌ అయి మంచి విజయాల్ని నమోదు చేస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా సినిమాకోసం ఇప్పటికే మహేష్‌ని ఒప్పించిన వంశీ, ఆ ప్రాజెక్ట్‌ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాడట. జేమ్స్‌బాండ్‌ తరహాలో మహేష్‌ ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. వంశీ పైడిపల్లి అంటే, స్టయిలిష్‌ డైరెక్టర్‌.. అని అందరికీ తెల్సిందే. సో, ఈ ఇద్దరి నుంచి రాబోయే పాన్‌ ఇండియా మూవీ కూడా అంతే స్టయిలిష్‌గా వుండబోతోందన్నమాట. ప్రస్తుతం మహేష్‌ 'సర్కారు వారి పాట' సినిమా పనుల్లో బిజీగా వున్న విషయం విదితమే.

ALSO READ: భాగ‌... 'మ‌తి' పోయిందా?