ENGLISH

లక్‌ అంటే 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టిదే.!

13 December 2020-17:09 PM

తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే, వరుసగా టాలీవుడ్‌లో అవకాశాలు దక్కించేసుకుంటోంది డింపుల్‌ బ్యూటీ కృతి శెట్టి. తెలుగులో 'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న విషయం విదితమే. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. అటు కృతి శెట్టికీ, ఇటు వైష్ణవ్‌ తేజ్‌కీ ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.

 

బుచ్చిబాబు సన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలా వుంటే, కృతి శెట్టి నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న 'శ్యామ్‌ సింగ్ రాయ్‌' సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యింది. మొత్తంగా మూడు సినిమాల్లో నటిస్తోందిప్పుడు ఈ బ్యూటీ. కాగా, మరో మెగా హీరోతో కృతి శెట్టి జత కట్టబోతోందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం. ఒక్కసారి మెగా కాంపౌండ్‌లో ఛాన్స్‌ దక్కించుకుంటే, ఆ తర్వాత వరుస సినిమాలు ఆ మెగా కాంపౌండ్‌లోనే చేయడం హీరోయిన్లకు.. నిజంగానే వెరీ స్పెషల్‌. కేవలం మెగా కాంపౌండ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరోయిన్ల కొరత నేపథ్యంలో యంగ్‌ హీరోలంతా హీరోయిన్ల వేటలో బిజీగా వున్నారు.

 

ఈ క్రమంలో కృతి శెట్టి, చాలామంది యంగ్‌ హీరోలకు బెస్ట్‌ ఆప్షన్‌గా కన్పిస్తోంది. 'ఉప్పెన' విడుదలకు ముందే ఇలా వుంటే, సినిమా విడుదలయ్యాక ఈ బ్యూటీ రేంజ్‌ ఇంకే స్థాయికి వెళ్ళిపోతుందోనన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆల్రెడీ కృతి శెట్టి టాప్‌ లీగ్‌లోకి వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. లక్‌ అంటే ఇలా వుండాలి మరి.!

ALSO READ: భాగ‌... 'మ‌తి' పోయిందా?