ENGLISH

భాగ‌... 'మ‌తి' పోయిందా?

12 December 2020-18:04 PM

రీమేకులు చేయ‌డం అంత ఈజీ కాదు. క‌థ‌ని త‌ర్జుమా చేస్తే హిట్టొచ్చేయ‌దు. ఆ క‌థ‌తో మ‌రో మ్యాజిక్ ఏదో చేయాలి. లేదంటే... హిట్టు క‌థ‌ని చేచేతులా పాడు చేసిన‌ట్ట‌వుతుంది. `భాగ‌మ‌తి` రీమేక్ విష‌యంలోనూ అదే జ‌రిగింది.

 

తెలుగులో సూప‌ర్‌హిట్ట‌యిన సినిమా `భాగ‌మ‌తి`. అనుష్క రేంజ్ మ‌రింత పెంచి సినిమా ఇది. ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. `దుర్గామ‌తి` పేరుతో ఈ సినిమా హిందీలోకి వెళ్లింది. తెలుగులో తీసిన అశోక్‌నే బాలీవుడ్ రీమేక్ కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే తెలుగులో చేజిన మ్యాజిక్ ఆయ‌న బాలీవుడ్ లో చేయ‌లేక‌పోయారు. `దుర్గామ‌తి` చూసిన‌వాళ్లంతా `ఇదేం సినిమా... ఈ క‌థ తెలుగులో ఎలా హిట్ట‌యిపోయింది` అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. తెలుగులో ఉన్న‌ది ఉన్న‌ట్టు బాలీవుడ్ లోనూ తీశాడు అశోక్‌. ఓర‌కంగా క‌ట్ పేస్ట్ చేశాడు. అయినా స‌రే... క‌నీసం యావ‌రేజ్ వ‌ర‌కూ వెళ్ల‌లేక‌పోయింది.

ALSO READ: అయ్యోపాపం రజనీకాంత్‌.. ఈ జోరు ఇకపై కొనసాగేనా.?