యువ హీరోలు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే... పెళ్లి విషయంలోనూ తొందరపడుతున్నారు. కార్తికేయ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన నిశ్చితార్థం... ఆదివారం హైదరాబాద్ లో సింపుల్ గా జరిగిపోయింది. ఆర్.ఎక్స్ 100తో ఆకట్టుకున్న హీరో కార్తికేయ. గ్యాంగ్ లీడర్ లో విలన్ గానూ నటించాడు. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోల్లో తానొకడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో కార్తికేయ నిశ్చితార్థం జరిగింది.
కుటుంబ సభ్యులతో పాటు అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం జరిగింది. పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా కార్తికేయ నిశ్చితార్థానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే పెళ్లి కూతురు ఎవరు? అనే విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ లేదు. దగ్గరి బంధువుల అమ్మాయినే కార్తికేయ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
ALSO READ: కల్యాణమండపంలో కురిసిన వసూళ్లెన్ని?