సెకండ్ వేవ్ తరవాత.... థియేటర్లకు కాస్తలో కాస్త ఊపు తీసుకొచ్చిన సినిమా.. `ఎస్.ఆర్.కల్యాణమండపం`. కిణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరో. సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ పండడం, పాటలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా నిలబడగలిగింది. తొలి రోజు మంచి వసూళ్లని అందుకున్న ఈ చిత్రం.. ఆ తరవాత అదే ఊపు కొనసాగించింది. మొత్తానికి రెండు వారాలకు దాదాపు 8 కోట్ల షేర్ సాధించింది.
ఈ సినిమాని దాదాపు 4.5 కోట్లకు అమ్మారని టాక్. ఆ లెక్కన చూస్తే.. ఈ చిత్రానికి మంచి లాభాలొచ్చినట్టే. నిజానికి కరోనా కారణంగా థియేటర్లని మూసి వేసినప్పుడు ఈ సినిమాకి మంచి ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ నిర్మాతలు ఓటీటీకి ఇవ్వలేదు. సినిమాపై నమ్మకంతో థియేటర్లలోనే విడుదల చేశారు. ఇప్పుడు అందుకు తగిన ఫలితమే వచ్చింది. ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు.
కేవలం 3 ఆటలతోనే సినిమాల్ని నడిపించారు. అయినా సరే, ఈ సినిమా ఇన్ని వసూళ్లు సాధించిందంటే గ్రేటే అనుకోవాలి. ఎస్.ఆర్... వసూళ్లు చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ALSO READ: బన్నీ కోసం పరశురామ్ స్కెచ్